మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తిరగబడుతా : ఎమ్మెల్యే రమేష్ బాబు

మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తిరగబడుతా : ఎమ్మెల్యే రమేష్ బాబు

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానని చెప్పారు. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేవని అన్నారు. అసెంబ్లీలో ముప్పు గ్రామాల సమస్యలపై అధికార పక్షం మాదిరిగా కాకుండా, ప్రతిపక్షం నేతగా తాను పోరాటం చేశాననని చెప్పారు. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే బాగుండేదని, సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యేవనీ మంత్రి కేటీఆర్ తో తాను స్వయంగా అన్నానని చెప్పారు.వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు.. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్​ బాబు ఈ కామెంట్స్ చేశారు. 

మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై తాను ప్రశ్నించానని, ఇవన్నీ విషయాలు ప్రజలకు, ముంపు గ్రామాల నిర్వాసితులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే రమేష్​ బాబు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం తాను ఎక్కని గడప లేదని, కాళ్లు తప్ప అన్ని చేశానని అన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి తనకు అత్మగౌరవం ఉందన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకుంటే తానే పోరాటం చేస్తానని అన్నారు. విషాద గాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని.. నేర్చుకున్నవారే ప్రజలకు చేరువ అవుతారని చెప్పారు.

మరోవైపు.. ఎమ్మెల్యే రమేష్ బాబు కామెంట్స్​ పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిర్వాసితులను మోసం చేసేందుకు ఎమ్మెల్యే కొత్త డ్రామా అంటూ మిడ్ మనేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్ ఆరోపించారు.