రేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్

 రేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని శుభ్రం చేశారు. రెండేళ్లుగా భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానం చేయకుండా నిషేధం అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొని కరోనాకు మునుపటి దైనందిన కైంకర్యాలు నిర్వహిస్తున్నా.. రాజన్న ఆలయం ధర్మగుండంలో పుణ్య స్నానాలకు మాత్రం అనుమతివ్వలేదు. 

ధర్మగుండంలో పుణ్య స్నానాలకు బదులు నల్లాల ద్వారానే స్నానం చేసి, స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా 2020 ఫిబ్రవరి 19 తేదీన మూసివేసిన  ఆలయ ధర్మగుండాన్ని ఎట్టకేలకు రేపు ఓపెన్ చేయనున్నారు. రేపు ఆదివారం నుంచి మళ్లీ ధర్మగుండంలో  పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులకు అవకాశం లభించనుంది.