వైభవంగా వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

వైభవంగా వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
  • పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు రమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్ తరఫున చైర్మన్ నరసింహమూర్తి స్వామివారికి పట్టువస్త్రాలు

అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తజన సందోహం మధ్య స్వామి–అమ్మవార్ల కల్యాణం కనుల పండువగా జరిగింది. కల్యాణంలో భక్తులు పాల్గొని పరవశించిపోయారు.

కల్యాణంలో పాల్గొన్న విప్ బీర్ల ఐలయ్య..

వేంకటగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.