టాలీవుడ్‌‌‌‌లో డ్రగ్స్ కస్టమర్లు ఎంతమంది ? .. వెంకటరత్నారెడ్డిని విచారించిన టీ న్యాబ్ 

టాలీవుడ్‌‌‌‌లో డ్రగ్స్ కస్టమర్లు ఎంతమంది ? .. వెంకటరత్నారెడ్డిని విచారించిన టీ న్యాబ్ 
  • ఫిల్మ్‌‌‌‌  ఫైనాన్సియర్‌‌‌‌‌‌‌‌ వెంకటరత్నారెడ్డిని విచారించిన టీ న్యాబ్ 
  • రెండో రోజు విచారణలో కీలక సమాచారం
  • స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌, వాట్సప్‌‌‌‌, కాల్‌‌‌‌డేటా ఆధారంగా దర్యాప్తు
  • 57 మంది అనుమానితులు,18 మంది కస్టమర్ల గుర్తింపు
  • రేపటితో ముగియనున్న ముగ్గురి కస్టడీ

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌‌‌‌ కస్టమర్లపై స్టేట్ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరో( టీ న్యాబ్) నిఘా పెట్టింది. ఇప్పటికే 57 మందికిపైగా అనుమానితులను గుర్తించింది. ఫిల్మ్‌‌‌‌ ఫైనాన్సియర్ వెంకటరత్నారెడ్డి నుంచి వివరాలు రాబడుతుంది. అనుమానితులు డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారా..! అనే కోణంలో ఆధారాలు సేకరిస్తుంది. మాదాపూర్‌‌‌‌ ‌‌‌‌విఠల్‌‌‌‌
నగర్​లో గత నెల 30న వెంకటరత్నారెడ్డి, రైల్‌‌‌‌ నిలయం సీనియర్ స్టెనో మురళి, డ్రగ్‌‌‌‌ సప్లయర్‌‌‌‌‌‌‌‌, మాజీ నేవీ ఉద్యోగి బాలాజీని టీ న్యాబ్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  నాంపల్లి కోర్టు అనుమతితో మంగళవారం నుంచి 4 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. 

కన్జ్యూమర్లకు నోటీసులు

రేపటితో కస్టడీ ముగియనుండగా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలాజీ వద్ద డ్రగ్స్‌‌‌‌ కస్టమర్ల డేటా తీసుకుంటున్నారు. డ్రగ్స్ పార్టీలో 18మంది పాల్గొన్నట్లు ఇప్పటికే గుర్తించారు. మంగళ, బుధవారాల్లో కస్టడీ విచారణలో ముగ్గురి వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఫోన్‌‌‌‌ నంబర్స్, వాట్సాప్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్స్‌‌‌‌ పై వివరాలు సేకరించారు. కస్టమర్ల లిస్ట్‌‌‌‌లోని కలహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సుశాంత్‌‌‌‌రెడ్డి, రామ్‌‌‌‌చంద్‌‌‌‌, అర్జున్‌‌‌‌, ఉప్పలపాటి రవి, ప్రణీత్‌‌‌‌, సందీప్‌‌‌‌,  సూర్య, శ్వేత, కార్తీక్‌‌‌‌, హిటాచి, నర్సింగ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ అజీమ్‌‌‌‌,అమ్జద్‌‌‌‌,ఇంద్రతేజ,సురేష్‌‌‌‌,రామ్‌‌‌‌కుమార్‌‌‌‌ గురించి ఆరా తీశారు. వీరికి ఇప్పటికే నోటీసులు అందించి విచారించారు. రెండ్రోజుల విచారణలో వెంకటరత్నారెడ్డి సహకరించలేదని సమాచారం.

ALSO READ: మండలానికో సర్కారు ఓక్రిడ్జ్ బడి పెట్టాలి: ఆకునూరి మురళి

57 మందికిపైగా అనుమానితులు..

ప్రధానంగా టాలీవుడ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ కేసులో కస్టమర్లుగా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కస్టమర్ల పైనే టీ న్యాబ్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. వెంకటరత్నారెడ్డి ఫైనాన్స్‌‌‌‌ చేసిన సినిమాల్లో వారికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. స్నాప్ చాట్స్, కాల్‌‌‌‌డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వెంకటరత్నారెడ్డి, బాలాజీ కాల్‌‌‌‌లిస్ట్‌‌‌‌, వాట్సాప్‌‌‌‌ చాటింగ్స్‌‌‌‌ ఆధారంగా దాదాపు 57 మందికిపైగా అనుమానితులను గుర్తించారు. వీరంతా డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నట్లు ఆధారాలు సేకరించారు.