
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మంజు వారియర్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
కాగా ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రంలోని మనసిలియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని రజినీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ALSO READ | Saripodhaa Sanivaaram: నెట్‌ఫ్లిక్స్‌లో సరిపోదా శనివారం దూకుడు .. ఇండియాలోనే నంబర్ 1
దీంతో తాజాగా వెట్టయన్ ట్రైలర్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2న వెట్టయన్ చిత్ర ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ & కన్నడ తదితర భాషల్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రజినీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
The Target is set! ? The VETTAIYAN ?️ trailer is dropping on October 2nd. ? Get ready to catch the prey. ?#Vettaiyan ?️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Qs8w8xJRqH
— Lyca Productions (@LycaProductions) September 30, 2024
ఈ విషయం ఇలా ఉండగా రజనీకాంత్ గతంలో నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంతో హిట్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు.