- టీఎంఎస్ ఆర్ యూ డిమాండ్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం మందుల ధరలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీధర్, సెక్రటరి బాను ప్రకాశ్, వైస్ ప్రెసిడెంట్ రాజ్ భట్ డిమాండ్ చేశారు.
ఆదివారం నగరంలో యూనియన్ రిసెప్షన్ కమిటీ ఫార్మేషన్ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మందుల కంపెనీలు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, పని గంటలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం 26 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేటు యాజమాన్య అనుకూల విధానాలను అమలు చేస్తూ కార్మికుల సమ్మెకు పోరాట హక్కులను హరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 26వ తేదీ జరిగే ఆందోళన పోరాటాల్లో మెడికల్ రిప్సు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. జిల్లాలో టీ ఎం ఎస్ ఆర్ యు రాష్ట్ర 6ల మహాసభలను వచ్చే ఏడాదిలో మహబూబ్ నగర్ నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శోభన్ యాదవ్, రాఘవేందర్, భాను, ప్రకాష్ రమణా రెడ్డి, అమరేందర్, మాధవ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
