లారెన్స్‌తో కలిసి స్టెప్పులేసిన వెంకీ మామా..వీడియో వైరల్

లారెన్స్‌తో కలిసి స్టెప్పులేసిన వెంకీ మామా..వీడియో వైరల్

రాఘ‌‌‌‌వ లారెన్స్‌ (Raghava Lawrence)‌‌‌, ఎస్‌‌‌‌.జె.సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌‌‌‌లో నటిస్తోన్న మూవీ జిగర్‌ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్టోన్ బెంచ్ ఫిలింస్ (Stone Bench Films) బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. 

జిగర్‌ తండ డబుల్ ఎక్స్ మూవీ నవంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్గా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తెలుగులో నిన్న రాత్రి (నవంబర్ 4న) నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిధిగా టాలీవుడ్ స్టార్ హీరో ద‌గ్గుబాటి వెంకటేష్ (Venkatesh) హాజరయ్యాడు.

అక్కడ ఈవెంట్ ఆర్గనైజింగ్ టీం.. ప్రేమించుకుందాం రా (Preminchukundhamraa) సినిమాలోని సాంగ్ ప్లే చేశారు. ఈ సినిమాలోని ఐకానిక్ సాంగ్ అయిన..పెళ్లికళ వచ్చేసిందే బాలా.. పల్లకిని తెచ్చేసిందే బాలా..అంటూ సాగే సాంగ్కు లారెన్స్ తో కలిసి వెంకీ మామ స్టెప్పులు వేశారు. ఈ పాటలోని సిగ్నేచర్ స్టెప్ వేసి..ఫ్యాన్స్ ను ఉత్తేజపరిచారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ALSO  READ : కాలేజ్ లైఫ్లో కదిలించేంత అమ్మాయి కనిపించలే : నాని

తొమ్మిదేళ్ల క్రితం కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraju) తీసిన ‘జిగర్తాండ’ (తెలుగులో ‘గద్దలకొండ గణేష్‌‌‌‌’) లోనూ కథ ఇదే. అయితే ఈసారి 1975 బ్యాక్‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే పీరియాడికల్ డ్రామాగా దీన్ని మార్చాడు దర్శకుడు. అందుకు తగ్గట్టే లారెన్స్, సూర్య వింటేజ్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించి ఆకట్టుకున్నారు.