కాలేజ్ లైఫ్లో కదిలించేంత అమ్మాయి కనిపించలే : నాని

కాలేజ్ లైఫ్లో కదిలించేంత అమ్మాయి కనిపించలే : నాని

నాని (Nani) హాయ్ నాన్న (Hi Nanna) మూవీ ప్రమోషన్స్తో ఆడియన్స్కు బాగా దగ్గరవుతూ..చాలా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్గా నాని ప్రమోషన్స్ లో భాగంగా కాలేజీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేమ కథలుంటాయి. ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక చోట ప్రేమించాలని చిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ, తనకు ఎలాంటి ప్రేమానుభవాలు, అలాంటి పరిచయాలు లేవని చెబుతున్నాడు.  

ఇక తన హాయ్ నాన్న మూవీ విషయానికి వస్తే మాత్రం..ఈ సినిమాలో టన్నుల కొద్దీ ప్రేమ ఉందని, వచ్చే ప్రతి సీన్కు యూత్ బాగా కనెక్ట్ అవుతారని తెలిపారు. నానిని కదిలించేంత అమ్మాయే కాదు..అలా లవ్ చేయాలనే క్షణాలు కూడా రాలేదని చెప్పారు.

కానీ, ఇప్పటికి కాలేజీ లైఫ్ లో ప్రేమించలేదనే చిన్న ఫీలింగ్ మాత్రం ఉందంటూ బాధ వ్యక్తం చేశాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి..ఈ కాలేజ్ మాత్రం కళకళలాడుతోందని, అబ్బాయిలకు చాలా ఛాన్సులు దొరుకుతాయంటూ కాలేజ్ స్టూడెంట్స్ను సరదా సంభాషణతో కేరింతలు పుట్టించాడు. 

శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్లో వస్తోన్న హాయ్ నాన్న రిలీజ్ కు సిద్దమయ్యింది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి 'అమ్మాడి' థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సమయమా..గాజుబొమ్మ సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ALSO  READ : టర్న్ తీసుకుంటున్న టాప్ డైరెక్టర్స్.. దేవి శ్రీ టైమ్ వచ్చింది అంతే

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తోవస్తోన్న హాయ్ నాన్న మూవీని.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు. ఖుషీ చిత్రానికి మ్యూజిక్ అందించిన హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది.