వీడియో వైరల్: సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌‌తో ఎస్పీ ఫైటింగ్

వీడియో వైరల్: సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌‌తో ఎస్పీ ఫైటింగ్

షిమ్లా: హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ జరగడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారిని ఎస్పీ చెంపదెబ్బ కొట్టడం, తిరిగి ఎస్పీని సెక్యూరిటీ అధికారి కొట్టడం వివాదాస్పదంగా మారింది. భుంతర్​ విమానాశ్రయం వద్ద కులూ జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, సీఎం జైరాం ఠాకూర్ సెక్యూరిటీ ఆఫీసర్​ మధ్య వివాదం తీవ్రమైంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అధికారిని చెంపదెబ్బ కొట్టారు కులు ఎస్పీ. దీనిపై ఆగ్రహించిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గౌరవ్​ సింగ్​పై తిరిగి చేయి చేసుకోవడంతోపాటు కాలితో తన్నారు. అయితే సమీపంలో ఉన్న పోలీసు అధికారులు వెంటనే కలుగజేసుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.