పనికి భయపడి సాకులు చెప్పే యువతకు ఈ బామ్మ స్ఫూర్తి

పనికి భయపడి సాకులు చెప్పే యువతకు ఈ బామ్మ స్ఫూర్తి

మనిషి జీవితం నిరంతర పోరాటం.. బతకడం కోసం ప్రతి రోజూ యుద్ధం చేయాల్సిందే. వృద్ధాప్యంలో కూడా కొందరు బతుకుబండిని ముందుకు నడిపేందుకు ఎంతో కష్టపడుతుంటారు.  ఇక్కడ ఈ 60 ఏళ్ల బామ్మ కూడా అంతే. ఆమె ఎవరో ఏమో తెలియదు కానీ ముంబై లోకల్ ట్రైన్‌లో చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతుంది. ఈ వీడియోను స్వాతి మలివాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 72 వేలకు పైగా వ్యూస్ రాగా, 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 8 వందలకు పైగా రీట్వీట్లు చేశారు. వృద్ధాప్యంలో ఇతరుల నుండి సహాయం కోసం అడిగే అవకాశం ఉన్నప్పటికీ, స్వతంత్రంగా డబ్బు సంపాదించడానికి ఆమె కష్టపడుతున్న తీరు నెటిజన్లను కట్టిపడేసింది. ఈ వృద్ధురాలికి సెల్యూట్.. పనికి భయపడి సాకులు చెప్పే యువతకు ఈమె స్ఫూర్తినిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ బామ్మ ఎక్కడుటుందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.