
తమిళంతో పాటు తెలుగులోనూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) చిత్రంలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఇందులో తను తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్. స్నేహా, లైలా, జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విజయ్‌కి ఇది 68వ చిత్రం. ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది.