Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్

Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్(Parasuram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం లాంటి సూపర్ హిట్ తరువాత విజయ్, పరశురామ్  కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ఫ్యామిలీ స్టార్ పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తన కోసం ఈవెంట్ కి వచ్చిన బాయ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు... నేను తిరుపతికి చాలాసార్లు వచ్చాను కొండమీద స్వామిని దర్శించుకున్నాను కానీ, మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోలేదు. ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం తిరుపతిలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ లో మీరు ఇస్తున్న ఎనర్జీ చూసి మాకు నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.

గీతగోవిందం సమయంలో యాక్షన్ సినిమా కావాలన్నారు. యాక్షన్ సినిమా చేశాక ఇప్పుడు ఫ్యామిలీ సినిమా కావాలంటున్నారు. అందుకే ఈసారి అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి మీ ముందుకు వస్తున్నాం. మేము ప్రమోషన్స్ కోసం ఇక్కడికి వస్తున్నాం అని తెలిసి చాలా మంది బాయ్స్ బైక్ ర్యాలీ చేశారు. వారందరికీ లీటర్ పెట్రోల్ కచ్చితంగా కొట్టించాలి. మా సినిమా తిరుపతి డిస్ట్రిబ్యూటర్‌ను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను.. బైక్ పై వచ్చిన బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ప్లీజ్.. అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి విజయ్ చాలా ఆశలు పెట్టుకున్న ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఆయనకీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.