మనది దేవర ఫ్యామిలీ.. నా సంపాదనలో మీకు భాగం: విజయ్ దేవరకొండ

మనది దేవర ఫ్యామిలీ.. నా సంపాదనలో మీకు భాగం: విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) హీరోగా సమంత(Samantha) హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). శివ నిర్వాణ(Shiva nirvana) దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి ఈ సినిమాకు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతోంది ఈ సినిమా. 

Also Read : క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌తో.. శెట్టి.. పొలిశెట్టి

ఈ సంధర్బంగా ఖుషి సక్సెస్ మీట్ ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఫేక్‌ రేటింగ్స్‌, ఫేక్‌ రివ్యూలు కూడా వచ్చాయి. వాటన్నింటినీ దాటుకుని ఖుషి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దానికి కారణం నా అభిమానుల ప్రేమే. మీరిస్తున్న ఈ సపోర్ట్, ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి మాట్లాడాలనిపించడం లేదు. దాని గురించి మరో రోజు మాట్లాడుకుందాం. ఈ సినిమాతో మీ అందరి మొహాల్లో నవ్వులు చూడాలనుకున్నాను. ఆ కోరిక తీరింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.

డబ్బులు సంపాదించాలి, అమ్మానాన్నలను సంతోషంగా ఉంచాలి. సొసైటీలో గౌరవం కావాలి. వీటిని దృష్టిలో పెట్టుకొనే ఇన్నిరోజులు పనిచేశాను కానీ.. ఇప్పుటి నుండి కేవలం మీకోసం పనిచేయాలనుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి.. నా సంపాదన నుంచి వారికి రూ.కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున అది కూడా వచ్చే పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ. కెరీర్ మొదటినుండి నా ఆనందంలో మీరు ఉన్నారు. అందుకే నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్‌ అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.