
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రొమోషన్స్లో జోరు పెంచింది.
ఇక లేటెస్ట్గా హీరో విజయ్ దేవరకొండ ప్రొమోషన్స్లో భాగంగా తమిళనాడు కోయంబత్తూరులోని GRD అఫ్ సైన్స్ కాలేజీ రాబోతున్నాడని మైత్రి మేకర్స్ ట్వీట్ చేశారు. ఖుషి మెమోరీస్ ఇవ్వడానికి వస్తోన్న విప్లవ్ ను మీట్ అవ్వడానికి రెడీగా ఉండండి అంటూ పేర్కోన్నారు.
దీంతో స్టూడెంట్స్..వీ ఆర్ రెడీ ఫర్ ఖుషి అంటూ రెస్పాండ్ అవుతున్నారు.ఇక రీసెంట్గా ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ను కండక్ట్ చేసిన ఖుషి మేకర్స్ అందరినీ ఆకట్టుకున్నారు. సమంత..విజయ్ చేసిన డాన్స్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. దీంతో మూవీ ప్రొమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఖుషి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab) హృదయాలను హత్తుకునేలా సాంగ్స్ కంపోజ్ చేశారు. ఖుషి మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం,మలయాళం, హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Our Viplav has landed in Coimbatore ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2023
Get ready GRD College, to meet @TheDeverakonda and make Kushi filled memories ❤?
In cinemas SEP 1st ?@Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/2pAXgQc0Os