
ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో విజయదేవర కొండ తనకి లైఫ్ ఇచ్చిన వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తూ ఆదర్శంగా నిలిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నరాజు 2003 లో 2.5కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ ను హీరోగా, వీవీవినాయక్ డైరక్టర్ గా “దిల్” సినిమాను నిర్మించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో రాజు కాస్తా దిల్ రాజుగా మారింది. దిల్ సినిమాతో విజయంతో దిల్ రాజు పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. నిర్మాతగా విజయన్నాందించిన డైరక్టర్ వీవీవినాయక్ ను హీరోగా మార్చి దిల్ రాజు రుణం తీర్చుకుంటున్నాడు. ప్రస్తుతం “సీనయ్య” సినిమా తో వినాయక్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు విజయదేవర కొండ కూడా అంతే.
అప్పటి వరకు సైడ్ క్యారక్టర్లు చేస్తున్న విజయదేవర కొండను తరుణ్ భాస్కర్ హీరోగా పెళ్లి చూపులు చిత్రాన్ని డైరక్ట్ చేశాడు. లవ్ అండ్ ఎంటర్ టైనర్ జోనర్ లో విడుదలైన పెళ్లి చూపులు బాక్సా ఫీస్ ను షేక్ చేసింది. హీరోగా విజయ్ క్లిక్ అయ్యాడు. మంచి స్టార్ డమ్ ను సంపాదించాడు. తనని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన తరుణ్ భాస్కర్ ను సైతం హీరోగా పరిచయం చేస్తూ విజయదేవర కొండ తన సొంత బ్యానర్ లో “ మీకు మాత్రమే చెప్తా” సినిమా నిర్మిస్తున్నాడు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇలా తమకు లైఫ్ ఇచ్చిన వారికోసం సినిమాలు నిర్మిస్తూ దిల్ రాజు, విజయదేవరకొండలు ఆదర్శంగా నిలుస్తున్నారు.