Thalapathy Vijay, Trisha: విజయ్, త్రిష.. సౌత్లో ఈ ఇద్దరికే టాప్ రెమ్యునరేషన్.. ఎన్ని కొట్లో తెలుసా?

Thalapathy Vijay, Trisha: విజయ్, త్రిష.. సౌత్లో ఈ ఇద్దరికే టాప్ రెమ్యునరేషన్.. ఎన్ని కొట్లో తెలుసా?

సినీ స్టార్స్ అంటేనే నెక్స్ట్ లెవల్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు ఏమ్ చేసినా డబ్బులే. ఓపక్క సినిమాలు, మరోపక్క యాడ్స్.. అలా వందల కోట్లు కొల్లగొడుతున్నారు మన స్టార్స్. ఒక్కో సినిమాకు వందల కోట్లలో తీసుకుంటున్నారు. కారణం.. వాళ్లకి మార్కెట్ లో ఉన్న డిమాండ్. ఆ డిమాండ్ ను బట్టే రెమ్యునరేషన్స్ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. మొన్నటివరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే వందల కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్స్ తీసుకునేవాళ్ళు.. ప్రస్తుతం మన సౌత్ స్టార్ కూడా మాకేం తక్కువ అంటున్నారు. వాల్లు కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం సౌత్ నుండి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఇద్దరు స్టార్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

ముందుగా హీరో విషయానికి వస్తే.. సౌత్ నుండి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా తలపతి విజయ్(Thalapathy Vijay) ఉన్నారు. ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.250 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట. ప్రస్తుతం సౌత్ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో ఇదే టాప్ అవటం విశేషం.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. చెన్నై చిన్నది త్రిష(Trisha) ఈ లిస్టులో టాప్ లో ఉన్నారు. ప్రస్తుతం త్రిష కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇటీవలే.. లియో, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న ఆమె.. ప్రస్తుతం కమల్ హాసన్ తో తగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం త్రిష ఏకంగా రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. మొన్నటివరకు రూ.10 కోట్లతో నయనతార టాప్ లో ఉండగా.. తగ్ లైఫ్ సినిమాతో త్రిష ఆమె ప్లేస్ ను ఆక్రమించింది. అలా సౌత్ నుండి విజయ్, త్రిష టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ముందుకు దూసుకుకుపోతున్నారు.