స్టార్ హీరో సూర్యను ఢీ కొట్టడానికి.. రెడీ అంటున్న తమన్నా బాయ్ఫ్రెండ్

స్టార్ హీరో సూర్యను ఢీ కొట్టడానికి.. రెడీ అంటున్న తమన్నా బాయ్ఫ్రెండ్

డైరెక్టర్ సుధ కొంగర(Sudha Kongara) డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన సూరరై పొట్రు.ఈ సినిమా అప్పట్లో వివిధ భాషల్లో విడుదలై ఎంత సక్సెస్ ను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలైన ఈ మూవీకి తెలుగులోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డైరెక్టర్ సుధ కొంగర మల్టీస్టారర్ మూవీ తీయడానికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ మల్టీస్టారర్ మూవీలో తమిళ స్టార్ హీరో సూర్య..మలయాళ సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఓ ప్రముఖ సంస్థ ముందుకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా, ఈ మూవీలో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay Varma) విలన్గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రసెంట్ విజయ్ వర్మ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. డార్లింగ్స్, దహద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ మూవీస్ తో ఫామ్ లో ఉన్న విజయ్ కోలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నారు. తన ఫస్ట్ కోలీవుడ్ మూవీ..స్టార్ హీరో సూర్యకి విలన్ గా చేస్తుండటంతో..విజయ్ కోలీవుడ్ లో నిరూపించుకున్నారు. 

హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉండగా..తర్వాత డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ జీవి ప్రకాష్ అద్దిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీ జీవి ప్రకాష్ కు 100వ మూవీ కావడంతో స్పెషల్ ట్యూన్స్ కంపొజిషన్ లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. సుధ కొంగర తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోలీవుడ్ లోనే పెద్ద మల్టీస్టారర్ గా రాబోతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.