చంద్రయాన్ 3 రిజల్ట్: విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయం వెల్లడి

చంద్రయాన్ 3 రిజల్ట్: విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయం వెల్లడి

ఆగస్టు 23న చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయం వెల్లడించింది. చంద్రుడిపై ల్యాండింగ్ టైమ్ లోనే విక్రమ్ ల్యాండర్ తనదైన ముద్ర వేసిందని తెలిపింది. చంద్రయాన్3 విక్రమ్ ల్యాండర్ మాడ్యుూల్, చంద్రుని దక్షిణ దృవంపై చారిత్రాత్మక టచ్ డౌన్ చేస్తున్నపుడు చంద్రుని ఉపరితలంపై ఎజెక్టా హాలో ను సృష్టించింది. విక్రమ్ ల్యాండ్ అవడంతో అక్కడ ఉపరితలంపూ ఉన్ర 2.06 టన్నుల మట్టి, రాళ్లు చెల్లా చెదురైనట్లు ఇస్రో తెలిపింది. విక్రమ్ ల్యాండైన్ ప్రదేశం చుట్టూ ఓ ప్యాచ్ లా ఏర్పడిందని పేర్కొంది. ఆ పర్దేశంలో వకి్రమ్ ల్యాండింగ్ కు ముందు ఆ తర్వాత తీసిన ఫొటోల ఆధారంగా ఇస్రో ఈ విషయన్ని గుర్తించింది. ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది.