SanthanaPrapthirasthu: ‘తెలుసా నీ కోసమే.. నన్నే దాచాలే’.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ రొమాంటిక్ మెలోడీ..

SanthanaPrapthirasthu: ‘తెలుసా నీ కోసమే.. నన్నే దాచాలే’.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ రొమాంటిక్ మెలోడీ..

విక్రాంత్, చాందిని  చౌదరి  జంటగా సంజీవ్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.  నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.

సోమవారం (Oct27) ఈ చిత్రం నుంచి  ‘తెలుసా నీ కోసమే..నన్నే దాచాలే’ అంటూ సాగే  లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. "ఆయ్", "సేవ్ ది టైగర్స్" వంటి సక్సెస్‍‌ఫుల్ ప్రాజెక్ట్స్‌కు వర్క్ చేసిన టాలెంటెడ్ అజయ్ అరసాడ సాంగ్ కంపోజ్ చేయగా, శ్రీమణి రాసిన లిరిక్స్, అర్మాన్ మాలిక్ పాడిన తీరు ఆకట్టుకుంది.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు అతిథిగా హాజరైన నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని అన్నారు. విక్రాంత్ మాట్లాడుతూ ‘పిల్లలు పుట్టని యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ వ్యాల్యూస్ చెప్పేలా ఉంటుంది’ అని  అన్నాడు.

నేడు సొసైటీ ఎదుర్కొంటున్న బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వకుండా లైట్ హార్టెడ్‌‌గా చేసిన స్క్రిప్ట్ ఇదని దర్శకుడు సంజీవ్ రెడ్డి చెప్పాడు. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమా కాంటెంపరరీగా ఉంటూ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ఈవెంట్‌లో స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ పాల్గొన్నారు.