విలేజ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో..రాజుగారి అమ్మాయి, నాయుడుగారి అబ్బాయి

 విలేజ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో..రాజుగారి అమ్మాయి, నాయుడుగారి అబ్బాయి

రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా సత్యరాజ్ దర్శకత్వంలో ముత్యాల రామదాసు,  నున్నా కుమారి నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి, నాయుడుగారి అబ్బాయి’. రోషన్ సాలూరి సంగీతం అందించాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో జరిగింది. ట్రైలర్‌‌ను విడుదల చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ మాట్లాడుతూ ‘అందరికీ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ, కమర్షియల్ అంశాలతో సత్యరాజ్‌‌ ఈ సినిమా చేశాడు.

సక్సెస్ సాధించి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌‌లో వస్తున్న కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్ ఇదని హీరో రవితేజ నున్నా చెప్పాడు. దర్శకుడు సత్యరాజ్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.  నిర్మాత ముత్యాల రామదాసు మాట్లాడుతూ

‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అన్ని అంశాలు ఉన్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయం సాధించే కళ ఇందులో కనిపిస్తోంది. మార్చి 9న విడుదలవుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.