
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మనాలాలో ఫారెస్ట్ అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు గ్రామస్తులు. సెప్టెంబర్ 19న రాత్రి మానలాలో గుర్తు తెలియని వ్యక్తులు అటవీ భూమి కబ్జా చేసేందుకు యత్నించారు. ఫారెస్ట్ ల్యాండ్ లో వందలాది నీలగిరి చెట్లను నరికిశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా చేరుకున్నారు. అయితే ఫారెస్ట్ అధికారుల ప్రొద్భలంతోనే చెట్లను నరికివేశారని వారితో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు.
అధికారులను కొద్ది సేపు గ్రామ పంచాయతీలో భవనంలో నిర్బంధించి నిలదీశారు గ్రామస్థులు. డీఎఫ్ ఓ రావాలంటూ ఫారెస్ట్ అధికారులతో గొడవకి దిగారు గ్రామస్తులు. వేలాది చెట్లను నరికివేసి భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకొని అటవీ భూమిని కాపాడాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు.
మనాల అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికే వందలాది ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ..అటవి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు గ్రామస్థులు. అక్రమణ దారులను కఠినంగా శిక్షించాలని కోరారు. అదే విధగా నూతనంగా ఉమ్మడి మానాలను 9 గ్రామ పంచాయతీలుగా చేశారు కానీ.. రెవెన్యూ అటవి సరిహద్దులు విభజించలేదన్నారు. మానాల అటవి రెవెన్యూ సరిహద్దులు ఏర్పాటు చేసినట్లయితే మా అడవిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రక్షించుకుంటామని తెలిపారు.