
- మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో ఘటన
పాల్ గఢ్: కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక మూక లాక్కెళ్లి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ గఢ్ జిల్లాలో గురువారం జరిగింది. ముంబై నుంచి వస్తున్న ఓ కారును గడ్చించలే కు దగ్గరలో కొందరు స్థానికులు అడ్డుకున్నారు. కారులో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చి వారిపై దాడికి దిగారు. రాళ్లతోపాటు మిగిలిన వస్తువులతో వారిని తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ ముగ్గురూ చనిపోగా, కారు కూడా ధ్వంసమైంది. మృత దేహాలను పోస్ట్ మార్టమ్ కోసం పాల్ గఢ్ కు పంపారు. చనిపోయిన వారు దొంగలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.