సిరికొండ మండలంలో అటవీ భూముల కబ్జాలు ఆపాలని ధర్నా

సిరికొండ మండలంలో అటవీ భూముల కబ్జాలు ఆపాలని ధర్నా

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ ​చేస్తూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో ఆక్రమణలు పెరిగాయని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 

మూడు గంటల పాటు ఆందోళన చేసిన గ్రామస్తులు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్​కుమార్, ఏసీపీ ప్రకాశ్ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. డీఎఫ్​వో సిద్ధార్థ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.