
హైదరాబాద్, వెలుగు: కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ, హాలిడేస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. రాజీవ్ రెడ్డి హైదరాబాద్ కంట్రీ క్లబ్‌లో ‘వీఐపీ గోల్డ్ మెంబర్‌షిప్ కార్డ్’ను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ 79వ ఉత్సవాలను పురస్కరించుకుని దీనిని ప్రవేశపెట్టారు. దీనిద్వారా గోల్ఫ్ కోర్స్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, జిమ్, స్పాలు, క్లబ్‌లో ఉన్న అన్ని సౌకర్యాలను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. రూమ్రెంట్లపై డిస్కౌంట్లు సహా పలు ప్రయోజనాలు పొందవచ్చు. కంట్రీ క్లబ్ తమ కార్యకలాపాలను తొలిసారి సిక్కింలోని గాంగ్టక్ నగరానికి విస్తరించినట్లు రెడ్డి ప్రకటించారు. ప్రీమియం హాలిడే అనుభవాలను టూరిస్ట్ ప్రియులకు అందించేందుకు ఈ కార్డ్ ఉపయోగపడుతుందని చెప్పారు.