రాముడు అయోధ్యని మార్చాడు.. కానీ, ఇప్పుడు అక్కడ స్కామ్

రాముడు అయోధ్యని మార్చాడు.. కానీ, ఇప్పుడు అక్కడ స్కామ్

గత రెండు నెలల క్రితం ప్రారంభమైన అయోధ్య రామమంధిరం ఇప్పుడు గొప్ప పర్యటక ప్రాంతంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ ప్రదేశంలో స్థానికుల పూర్వికులు భూములను ఆక్రమించుకొని జీవనం చేస్తుండేవారు. బాగా తెలిసిన వారు, చుట్టాల ద్వారానే అక్కడికి వెళ్లి రాముడి దర్శనం చేసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అద్భుతమైన మందిరం నిర్మామం దేశవిదేశాలను నుంచి భక్తలను ఆకర్షిస్తోంది.

దీంతో అక్కడ పర్యాటకంగా మంచి అభివృద్ధి జరుగుతోంది. కానీ అక్కడ ధరలు చుక్కలను అంటుతున్నాయని ఓ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. మోహన్ సిన్హా అనే వ్యక్తి అక్కడి పరిస్థితులను విపరిస్తూ ఎక్స్ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో అయోధ్య గ్రౌండ్ రియాల్టీని తెలియజేస్తూ.. రాముడు ఆ పట్టణాన్ని మార్చేశాడు కానీ అది ఇప్పటికీ ఒక స్కామ్ అని రాశాడు.

పెద్ద ఎత్తున భక్తులను అతిథ్యం ఇవ్వడానికి అక్కడ సౌకర్యాలు సరిపోవని సిన్హా చెప్పారు. అక్కడ హోటల్, లాడ్జీల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నా రెంట్లు మాత్రం ఎక్కవగా డిమాండ్ చేస్తున్నారని వివరించారు. రూ.1500 ఖరీదు చేసే హోటర్ రూం ఇప్పుడు రూ.11వేలు వసూలు చేస్తున్నారని ఆవేదన ఎక్స్ లో షేర్ చేసుకున్నాడు. కేవలం గుడికి దగ్గర ఉండటం వల్లనే అంత డబ్బు చెల్లించి ఆ హాటల్ లో ఉంటున్నారని అన్నారు. వీవీఐపీలు, స్పెషల్ దర్శల గురించి కూడా మోహన్ సిన్హా మాట్లాడారు. దర్శనానికి, లాకర్ రూం దగ్గర వారి వస్తువులను డిపాజిట్ చేయడానికి గంటల తరబడి సామాన్యలు వేచి ఉంటుంటే.. సెలబ్రెటీలు మాత్రం సులభంగా దర్శనానికి వెళ్తున్నారని ఆసంస్కృతిని ఆయన ఖండించారు.

also read : రూ. 3500 కోట్ల ఐటీ నోటీసులు.. కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్

భక్తుల దర్శనంలో అసమానతలు చూపించడాన్ని సిన్హా విమర్శించారు. ఒకప్పుడు గుడారంలో ఉండే బాలాజీ.. ఇప్పుడు అద్బుతమైన ఆలయంలో కొలువుదీరాడు. కానీ అక్కడ అంతా డబ్బులతోనే నడుస్తోందని వివరిస్తూ.. శ్రీరాముడు అయోద్యను మార్చేశాడు కానీ అక్కడ అంతా ఒక స్కామ్  లా ఉందని తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పడు వైరల్ గా మారింది.