పెళ్లిలో గన్ ఫైరింగ్ చేసిన కొత్త జంట

పెళ్లిలో గన్ ఫైరింగ్ చేసిన కొత్త జంట

వేడుకల్లో వధూవరుల సరదా వివాదాలకు దారి తీస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన వివాహంలో.. వధూవరులు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. వరుడు గన్ తో కాల్చుతుంటే.. వధువు ఎంకరేజ్ చేసింది.  తుపాకి కాల్చుతూ ఇద్దరూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వరుడు నాలుగు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కల్కా గారి ప్రాంతంలోని సూర్య ఫామ్ హౌస్‌లో డిసెంబర్ 9న జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికారి స్వతంత్ర సింగ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

For More News..

కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ