Gautam Gambhir: బీసీసీఐకి బిగ్ టెన్షన్.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్‌ను పట్టించుకోని రోహిత్, కోహ్లీ

Gautam Gambhir: బీసీసీఐకి బిగ్ టెన్షన్.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్‌ను పట్టించుకోని రోహిత్, కోహ్లీ

టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో విబేధాలు ఉన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. రోకో జోడీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ తో ఈ స్టార్ ప్లేయర్లకు మంచి సాన్నిహిత్యం లేనట్టు అర్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు గంభీర్, అగార్కర్ ఇద్దరూ కూడా రోహిత్, కోహ్లీ భవిష్యత్ పై క్లారిటీ ఇవ్వలేదు. పైగా వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగడం కష్టమే అన్నట్టు మాట్లాడారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. 

గంభీర్ తో రోహిత్, కోహ్లీ ఇద్దరూ మాట్లాడినట్టు కనిపించలేదు. సౌతాఫ్రికాతో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ గంభీర్ ను పట్టించుకోలేని వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రోకో ఫ్యాన్స్ గంభీర్ పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్న విధానం బీసీసీఐని టెన్షన్ కు గురి చేస్తోంది. వీరి మధ్య త్వరలోనే బీసీసీఐ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. "గౌతమ్ గంభీర్ తో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య సంబంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించి సమావేశం ఉండవచ్చు. రాయ్‌పూర్ లేదా విశాఖపట్నంలో ఈ మీటింగ్ జరగొచ్చు". అని రిపోర్ట్స్ చెప్పడం షాకింగ్ కు గురి చేస్తోంది. 

వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ తమ ఆట తీరుతో అదరగొట్టారు. నాలుగు మ్యాచ్ ల్లో రోహిత్ ఒక సెంచరీ.. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రోకో జోడీ రిటైర్మెంట్ వార్తలకు తమ సూపర్ తో చెక్ పెట్టారు. మరోవైపు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించే ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చింది. జట్టు పరివర్తన దశలో ఉన్నందున బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో బోర్డు చర్చలు జరుపుతుందని గంభీర్ ను తొలగించే ఆలోచన లేదని బీసీసీఐ అధికారి అన్నారు. 

హెడ్ కోచ్ గా గంభీర్ కు మిశ్రమ ఫలితాలు:

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టైటిల్ గెలిచినా టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు ఆరు టెస్ట్ సిరీస్ లు ఆడింది. వీటిలో రెండు గెలిచి మూడు ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సమమైంది. గెలిచిన రెండు సిరీస్ లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటివరకు విఫలమయ్యాడనే చెప్పాలి.