Kohli : ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ..జొమాటో ఫన్నీ రిప్లై

Kohli :  ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ..జొమాటో ఫన్నీ రిప్లై

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9నుంచి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం నాగ్ పూర్లో ఉన్న కోహ్లీ..ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో తన కొత్త ఫోన్ పోయిదంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. కనీసం అన్ బాక్స్ కూడా చేయలేదని..ఇది బాధాకరమైన విషయమన్నాడు. ఎవరైనా ఆ ఫోన్ను చూశారా..అంటూ కోహ్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. 

జొమాటో ఫన్నీ రిప్లై..

ఫోన్ పోయిందంటూ ట్వీట్ చేసిన కోహ్లీ..ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో..ఫన్నీ రిప్లై ఇచ్చింది. బాబీ ఫోన్ నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయాలని సూచించింది. ఈ ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. కొందరైతే ఫ్రీగా తమ కంపెనీకి అడ్వైజ్ చేసుకుంటుందని కామెంట్ చేశారు. 

విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ పెయిడ్ ట్వీట్ అంటూ  కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. వివో ఫోన్ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ ట్వీట్ చేశాడని చెబుతున్నారు.  బ్రాండ్స్ మెన్షన్ చేయడం కోసం కోహ్లీ ట్వీట్ చేయలేదని..అతని ఫోన్ నిజంగానే  పోయినట్లుందని మరికొందరు అంటున్నారు.

 

మరిన్ని వార్తలు