జూన్ 2న విరాటపర్వంలోని నగదారిలో సాంగ్ రిలీజ్

జూన్ 2న విరాటపర్వంలోని నగదారిలో సాంగ్ రిలీజ్

దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 17న ఈ మూవీ విడుదల కానుంది. ఇక ఈ మూవీ నుండి నగాదారిలో అనే పాటను జూన్ 2న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సాంగ్ రిలీజ్ తో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనుంది చిత్రబృందం. 2021 లోనే విడుదల కావాల్సివున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ మూవీలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర వంటి నటులు కీ రోల్స్ ప్లే చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నక్సలైట్ బ్యాక్డ్రాప్ లో  వస్తున్న ఈ మూవీలో రానా రవన్న పాత్రలో నటిస్తుండగా..సాయిపల్లవి వెన్నెల పాత్రలో నటిస్తోంది.