బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా హైపర్​లూప్.. తొలి హ్యూమన్ ట్రయల్ సక్సెస్

బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా హైపర్​లూప్.. తొలి హ్యూమన్ ట్రయల్ సక్సెస్

సియాటిల్(అమెరికా):బుల్లెట్​ ట్రైన్లకంటే వేగంగా దూసుకెళ్లే హైపర్​లూప్ వెహికల్ తొలి హ్యూమన్​ ట్రయల్​ను ఆదివారం సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశామని వర్జిన్​ గ్రూప్​ అధికారులు ప్రకటించారు. రిచర్డ్​ బ్రాన్సన్​కు చెందిన వర్జిన్​ గ్రూప్​ తయారు చేసిన ఈ వెహికల్​లో ఫస్ట్​ కంపెనీ ఉద్యోగులే ప్రయాణించారు. ఈ ప్రయత్నం మనుషులు, వస్తువుల రవాణాలో ముందడుగు అని వర్జిన్​ పేర్కొంది. ​ చీఫ్​ టెక్నాలజీ ఆఫీసర్​ తోపాటు మరికొందరు సీనియర్​ ఎగ్జిక్యూటివ్స్​ హైపర్​లూప్​ ట్రయల్​లో పాల్గొన్నారు. నెవడా సిటీ లాస్​వేగస్​ లోని లూప్​టెస్ట్​ సైట్​లో ఈ ట్రయల్​ జరిగింది. హైపర్​లూప్​చరిత్ర సృష్టించడం ఖాయమని ఈ సందర్భంగా వర్జిన్​ హైపర్​లూప్ ​చైర్మన్​ సుల్తాన్​ అహ్మద్ బిన్​ సులయెమ్​ కామెంట్​ చేశారు. హైపర్​లూప్​ కోసం నిర్మించే గొట్టపు ఆకారపు ట్రాక్​లోని వాక్యూమ్​ ట్యూబ్​ల ద్వారా మనుషులను, వస్తువులను రవాణా చేస్తారు. ఈ వెహికల్స్ గంటకు 966 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తాయి. ప్రస్తుతం కంపెనీ చేపట్టిన ట్రయల్​లో 172 కిలోమీటర్ల స్పీడ్​ను మాత్రమే సాధించగలిగారు. నెవడా టెస్ట్ సైట్​లో మనుషులు లేకుండా ఇది వరకు 400 సార్లు టెస్టులు నిర్వహించామని వర్జిన్​ వెల్లడించింది. 2025 కల్లా అన్ని సర్టిఫికేషన్లు సంపాదించి, 2030 నుంచి కమర్షియల్​ సర్వీసులు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని ప్రకటించింది.