
హైదరాబాద్, వెలుగు: విరించి లిమిటెడ్ ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ. 79.77 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ. 76.30 కోట్లతో పోలిస్తే 5.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ఫిన్‌టెక్ వ్యాపారం 'క్యూఫండ్' గత కొన్ని క్వార్టర్లుగా యూఎస్ మార్కెట్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని కంపెనీ పేర్కొంది. అమెరికాలో షార్ట్ టెర్మ్ లోన్లు, హోమ్ లోన్ సెక్టార్ కోసం ప్రత్యేకంగా క్యూఫండ్‌ను తీసుకొచ్చారు. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ విరించి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా జూన్ క్వార్టర్‌లో మంచి పనితీరు కనబరిచింది. విరించి లిమిటెడ్ ఫిన్‌టెక్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా మార్చనుంది. కొంత వాటాను అమ్మి, వచ్చిన డబ్బును అప్పులు తీర్చడానికి, ఆసుపత్రుల వ్యాపారాన్ని పెంచేందుకు వాడాలని చూస్తోంది.