పార్లమెంట్ నిర్మాణంలో ‘విశాక’ ఇండస్ట్రీస్ వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులు

పార్లమెంట్ నిర్మాణంలో ‘విశాక’ ఇండస్ట్రీస్  వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులు
  • బిల్డింగ్​ను ఎకోఫ్రెండ్లీగా, అందంగా మార్చటంలో తోడ్పాటు
  • టర్మైట్స్, వాటర్, ఫైర్ రెసిస్టెన్స్ వంటివి ఇతర ప్రత్యేకతలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణంలో హైదరాబాద్​కు చెందిన విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ కూడా కీలక పాత్ర పోషించింది. బిల్డింగ్​ను ఎకోఫ్రెండ్లీ(పర్యావరణ హితం)గా, అందంగా మార్చడంలో తోడ్పాటును అందించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్​లో గోడలకు క్లాడింగ్ మెటీరియల్ గా విశాక కంపెనీ తయారు చేసిన వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులనే వినియోగించారు.

పార్లమెంట్ బిల్డింగ్​ను ‘ప్లాటినం రేటెడ్ (గ్రీన్ బిల్డింగ్)’గా తీర్చిదిద్దడం వెనక వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డుల పాత్ర కూడా కీలకంగా నిలిచింది. పార్లమెంట్ బిల్డింగ్​ను అహ్మదాబాద్​లోని హెచ్‌సీపీ డిజైన్ అండ్ ప్లానింగ్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ డిజైన్ చేశారు. బిల్డింగ్ నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పూర్తి చేసింది. బిల్డింగ్ నిర్మాణంలో దేశంలోని అతికొద్ది కంపెనీలు పాలు పంచుకోగా, వాటిలో విశాక కూడా ప్రముఖ పాత్ర పోషించింది.  

‘వీనెక్ట్స్’ ప్రత్యేకతలు ఇవే.. 

పెద్ద పెద్ద బిల్డింగ్​లను ఎకోఫ్రెండ్లీగా మార్చేందుకు ఉపయోగపడేలా వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులను విశాక కంపెనీ తయారు చేస్తోంది. ఇందుకోసం అధునాతనమైన ‘లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ (ఎల్జీఎస్ఎఫ్)’ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ టెక్నాలజీతో బిల్డింగ్ బరువు గణనీయంగా తగ్గిపోతుంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ పెరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్​ల నిర్మాణం వేగంగా పూర్తి చేయొచ్చు. బిల్డింగ్​లకు బయటి వైపు, లోపలి వైపు గోడలకు, ఫ్లోరింగ్​కు, రూఫ్​లకు, ఫాల్స్ సీలింగ్​లకు కూడా ఈ ఫైబర్ సిమెంట్ బోర్డులను ఉపయోగించవచ్చు. వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులకు చెదలు పట్టవు. నీటికి తడిచిపోవు. వీటికి మంటలు కూడా అంటుకోవు.

అందుకే ఈ ప్రొడక్ట్​కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్లైవుడ్, జిప్సమ్ వంటి వాటిని ఉపయోగిస్తూ సమస్యలను ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఇవి మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. వీనెక్స్ట్ బోర్డులకు గ్రీన్ ప్రో సర్టిఫికెట్ కూడా లభించింది. వీటిని బిల్డింగ్ ఆర్కిటెక్చర్​లో ఎలా కావాలంటే అలా ఫిట్ చేసుకోవచ్చు. చాలా దృఢంగా ఉంటాయి. చూడటానికి అందంగా, అట్రాక్టివ్​గా కూడా కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందుకే వీనెక్స్ట్ కు పార్లమెంట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ దక్కిందని ఆ కంపెనీ వెల్లడించింది. అవసరాన్ని బట్టి రకరకాల డిజైన్లతో రూపొందించే వీనెక్స్ట్ బోర్డులను ఎయిర్ పోర్టులు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఐటీ కంపెనీలు, హోటల్స్ నిర్మాణంలోనూ ఉపయోగిస్తున్నారని తెలిపింది.