
విశాల్ హీరోగా ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 26న సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయ బోతున్నట్టు గురువారం మేకర్స్ అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇకపై వరుస అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.