V6 News

విశ్వక్ సేన్ హీరోగా ‘దేవర’ ప్రొడ్యూసర్ కొత్త సినిమా

విశ్వక్ సేన్ హీరోగా ‘దేవర’ ప్రొడ్యూసర్ కొత్త సినిమా

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్‌‌ ముందుకొస్తున్నాడు విశ్వక్ సేన్. ఇప్పటికే కల్ట్, లెగసీ చిత్రాలను పూర్తిచేసే పనిలో ఉండగా, సోమవారం కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌‌ర్‌‌టైన‌‌ర్‌‌కు ర‌‌జ‌‌త్ ద‌‌ర్శక‌‌త్వం వ‌‌హిస్తున్నాడు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై  ఎన్టీఆర్‌‌‌‌తో  ‘దేవర’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా, ముహూర్తపు షాట్‌‌కు దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టారు.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్‌‌ను మేకర్స్‌‌కు అందించారు.  ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్ట్‌‌పై మ‌‌రింత హైప్ పెరిగింది. అర‌‌వింద్ విశ్వనాథ‌‌న్ సినిమాటోగ్రాఫ‌‌ర్‌‌గా, తేజ‌‌స్ కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా వ‌‌ర్క్ చేస్తున్నారు.  భాను భోగ‌‌వ‌‌ర‌‌పు, నందు స‌‌విర‌‌గాన డైలాగ్స్ అందిస్తున్నారు. త్వర‌‌లోనే ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియ‌‌జేస్తామ‌‌ని మేకర్స్ తెలియ‌‌జేశారు.