పాట చిత్రీకరణలో విశ్వంభర

పాట చిత్రీకరణలో విశ్వంభర

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ శరవేగంగా  చిత్రీకరణ  జరుగుతోంది. ఇటీవల నల్గొండలో కొంత షూటింగ్ జరిగింది. తాజాగా హైదరాబాద్‌‌లో కొత్త షెడ్యూల్‌‌ ప్రారంభమైంది. శంకర్‌‌‌‌పల్లిలో వేసిన స్పెషల్‌‌ సెట్‌‌లో పాట చిత్రీకరిస్తున్నారు. వివాహ నిశ్చితార్థం నేపథ్యంలో వచ్చే పాట ఇదని తెలుస్తోంది.

శోబి మాస్టర్‌‌‌‌ కొరియోగ్రఫీ చేస్తుండగా చిరంజీవి, త్రిషతో పాటు పలువురు ఇతర నటీనటులు కనిపించనున్నారు. ఇందులో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్‌‌ లుక్‌‌ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.