వారంలో 42 ఈవెంట్లు .. ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి

వారంలో 42 ఈవెంట్లు .. ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేందుకు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్​ రేసులో ఉన్న రామస్వామి.. పోయిన వారం మొత్తం 42 క్యాంపెయిన్ ఈవెంట్లలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘లాస్ట్ వీక్ మొత్తం అయోవా స్టేట్​లోనే ప్రచారం చేశాను. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి నేనే సరైన వ్యక్తినని ఓటర్లకు వివరిస్తున్న. ఈ పోల్స్​లో నేను 50 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న. వారంలో 42 క్యాంపెయిన్ ఈవెంట్స్​లో పాల్గొన్న.  నా తల్లిదండ్రుల నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకున్న.. అవే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచాయి’’ అని వివేక్ తెలిపారు. తన అదృష్టం అంతా ‘వర్క్’లో ఉందని వివరించారు. ‘వర్క్’ అనేది తన జీవితంలోని ప్రధాన సూత్రమని వివేక్ రామస్వామి చెప్పారు.