మంచిర్యాల హమాలీవాడ రైల్వేగేట్​వద్ద..ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి

మంచిర్యాల హమాలీవాడ రైల్వేగేట్​వద్ద..ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి
  • మంచిర్యాల హమాలీవాడ రైల్వేగేట్​వద్ద..ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి
  • దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వివేక్ వెంకటస్వామి వినతి

హైదరాబాద్, వెలుగు : మంచిర్యాల హమాలీ వాడ రైల్వే గేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై జీఎం సానుకూలంగా స్పందించారని వివేక్​ తెలిపారు. పెద్దపల్లి లోక్ సభ పరిధిలో పలు సమస్యలపై ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు వివరించారు.

పెద్దపల్లి జిల్లా ఓదెల స్టేషన్ లో ప్యాసింజర్ రైళ్లకు హాల్ట్ సదుపాయాన్ని కల్పించాలని రైల్వే మంత్రిని కోరినట్లు తెలిపారు. రైల్వే మంత్రి ఆదేశాలతో జోన్ అధికారులు ప్యాసింజర్ ట్రైన్లకు హాల్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారన్నారు. రైల్వే జీఎంను కలిసిన వారిలో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, తదితరులు ఉన్నారు.