దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి
  • నయా నిజాంను ఎదిరించాలె
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి: దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో రాష్ట్రంలో నయా నిజాం పాలనను ఎదిరించాలని యువతకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి పిలుపునిచ్చారు. కొమురయ్య తన ప్రాణాలను లెక్కచేయకుండా నిజాం నియంతృత్వ పాలనను ఎదిరించి పోరాడారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అలాగే ఉన్నాయని, ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని చెప్పారు. 
ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన వివేక్.. జూలపల్లి మండలం అబ్బాపూర్‌‌‌‌లో కుర్మ సామాజిక వర్గ యువత ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒగ్గుడోలు కళాకారులు వివేక్‌‌కు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల ప్రజలు చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువుకోవడం వల్లనే ఆలోచించడం, ప్రశ్నించడం అనే లక్షణాలు అలవడుతాయని చెప్పారు.
కరోనా వారియర్లకు సన్మానం
సుల్తానాబాద్‌‌లో ఏగోలపు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరోనా ఫ్రంట్‌‌లైన్ వారియర్స్‌‌ను వివేక్ సన్మానించారు. వారికి షీల్డ్‌‌లను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రధాని మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆచరించారని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, కరోనాపై విజయం సాధించడంలో మోడీ పాత్ర ప్రశంసనీయమన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేషం, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, కాడే సూర్యనారయణ, సజ్జాద్, బాలసాని సతీశ్, ఏగోలపు సదయ్యగౌడ్, అమరగాని ప్రదీప్, భూమయ్య, మహంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

మరిన్ని వార్తల కోసం..

సొంతగడ్డపై గుజరాత్ గెలిచేనా..?

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల