శ్రీధర్మశాస్త్ర గోశాలలో వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు

శ్రీధర్మశాస్త్ర గోశాలలో వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు

బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్మశాస్త్ర గోశాలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాడ్ మున్సిపాలిటీ పరిధిలోని యాదవ్ నగర్ లోని  శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో గోమాతల మధ్య పుట్టినరోజు వేడుకలను వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా గోశాలలోని గోమాతలకు దాన అందజేశారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఏగోలపు సదయ్య గౌడ్ ఆకాంక్షించారు. 2023 సంవత్సరంలో బీజేపీలో ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సజ్జత్, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, కూకట్ల నాగరాజు, బాలసాని సతీష్ గౌడ్, గజబింకార్ పవన్, బుర్ర సతీష్ గౌడ్, బుసారపు సంపత్, వేగోళం కిరణ్ గౌడ్, మారం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.