చెన్నూరు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్.. భీమారంలో వివేక్ సరోజ ఎన్నికల ప్రచారం

చెన్నూరు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్.. భీమారంలో వివేక్ సరోజ ఎన్నికల ప్రచారం

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామికి అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే జీ. వివేక్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్న కాకా వెంకటస్వామి కుటుంబ సభ్యులకు అన్ని గ్రామాల్లోనూ ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజలందరూ వివేక్ కు మద్దతు ఇస్తున్నారు. 

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ బుధవారం (నవంబర్ 22న) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారం యాదవ సంఘం మహిళలతో వివేక్ సరోజతో పాటు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లలా భాగ్యలక్ష్మి సమావేశం నిర్వహించారు. అక్కడున్న మహిళలతో సరోజ అప్యాయంగా పలకరించి మాట్లాడారు. వారి కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వివేక్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలింపించాలని.. చెన్నూరు నియోజకవర్గా్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.