సీఎం కేసీఆర్కు వివేక్ వెంకటస్వామి సవాల్

సీఎం కేసీఆర్కు వివేక్ వెంకటస్వామి సవాల్

మహబూబాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశమంతా చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వివేక్ వెంకట స్వామి కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రజలు కేసీఆర్ అవినీతిని కోరుకోవడంలేదని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, లిక్కర్ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా కూరుకుపోయిందని అన్నారు.  సీఎం కేసీఆర్ కు దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించాలని సవాల్ విసిరారు. అవినీతిని వెలికి తీస్తారన్న భయంతోనే సీబీఐ విచారణ అడ్డుకునేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు మోడీ ఆవాస్ యోజన కోసం ఎదురు చూస్తున్నారని వివేక్ వెంకట స్వామి అన్నారు. యూపీలో 50లక్షల గృహాలు నిర్మించారన్న ఆయన.. బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 

అంతకు ముందు నెల్లికుదురు మండలం రాజ్య తండాకు వెళ్లిన వివేక్ వెంకటస్వామికి తండావాసులు లంబాడి సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు బీజేపీలో చేరాయి. వారందరికీ వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.