32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వివో టీ4ఆర్ విడుదల

32 ఎంపీ ఫ్రంట్  కెమెరాతో వివో టీ4ఆర్ విడుదల

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​  స్మార్ట్‌‌ ఫోన్  బ్రాండ్ వివో  ఇండియా మార్కెట్లో టీ4ఆర్​ 5జీ ఫోన్​ను  విడుదల చేసింది. ఇది 32 ఎంపీ ఫ్రంట్ ​కెమెరా, సన్నని క్వాడ్ కర్వ్‌‌డ్ డిస్‌‌ప్లే, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌‌తో వస్తోంది. ఈ ఫోన్‌‌కు శక్తివంతమైన మీడియాటెక్​డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంది.  

50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్​ మెయిన్ కెమెరా,   6.77-అంగుళాల డిస్‌‌ప్లే, 5,700 ఎంఏహెచ్​ బ్యాటరీ,  44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 8జీబీ ర్యామ్​, 256 జీబీ వరకు స్టోరేజీ అదనపు ఆకర్షణలు. ధరలు రూ.17,500 నుంచి రూ.21,500 వరకు ఉంటాయి. ఈ నెల ఐదో నుంచి అమ్మకాలు మొదలవుతాయి.