
వనపర్తి, వెలుగు: పెండింగ్ ఓటరు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వందేళ్లకు పైబడిన ఓటర్ల జాబితాను వెరిఫై చేయాలని, ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ఖీమ్యానాయక్, ఆర్డీవో సుబ్రమణ్యం, డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, తహసీల్దార్ రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సీ గురుకులాల్లో ఖాళీ సీట్లు..
జిల్లాలోని తెలంగాణ ఎస్సీ గురుకుల స్కూళ్లలో 2025–--26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నామని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బాలురు, బాలికల పాఠశాలల్లో కలిపి మొత్తం 81 సీట్లు మిగిలాయని, మదనాపురం, వీపనగండ్ల మండలాల్లోని బాలుర పాఠశాలల్లో, కొత్తకోట, గోపాల్పేట, పెద్దమందడి మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. టీజీ సీఈటీ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని, తర్వాత పరీక్ష రాయని వారిని డ్రా పద్ధతిలో తీసుకుంటారన్నారు. అర్హత గల స్టూడెంట్స్ఈ నెల 23న సాయంత్రం 5 గంటల్లోగా కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టొద్దు
గత సీజన్లో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే విషయంలో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టారని, ఈసారి ఆ పరిస్థితులు తలెత్తొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో వానాకాలం సీజన్వడ్ల కొనుగోలుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ డీసీసీబీ చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అడిషనల్కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ఆయన మాట్లాడారు.
పీపీసీలకు ఏ మిల్లును కేటాయిస్తారో అదే మిల్లుకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి, కొత్తకోట ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, డీఎస్వో కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఆర్డీవో ఉమాదేవి, డీసీవో రాణి, డీటీవో మానస తదితరులు పాల్గొన్నారు.