వనపర్తి జిల్లా పెబ్బేరులో బస్సు ఢీకొని మహిళలకు తీవ్రగాయాలు

వనపర్తి జిల్లా పెబ్బేరులో బస్సు ఢీకొని మహిళలకు తీవ్రగాయాలు

పెబ్బేరు, వెలుగు : బస్సు ఢీకొనడంతో మహిళలకు తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో జరిగింది. ఎస్ఐ యుగంధర్ రెడ్డి వివరాల ప్రకారం.. నారాయణపేటకు చెందిన కోటకొండ అంజమ్మ(50) ఇటీవల అయిజలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. ఆదివారం తన స్వగ్రామం నారాయణపేటకు తిరిగి వెళ్లేందుకు ఆదివారం గద్వాల డిపోకు చెందిన బస్సు ఎక్కింది. పెబ్బేరు సమీపంలోకి రాగానే టాయ్​లెట్ వస్తుంది.. బస్సును ఆపాలని కండక్టర్ ను కోరింది.

దీంతో కండక్టర్​బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. ఎక్కడ బస్సు వెళ్లిపోతుందోననే భయంతో అదే బస్సు వెనకాలకు ఆమె టాయ్​లెట్​వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్​గమనించకుండా బస్సును వెనక్కి కదిలించాడు. వెనక ఉన్న అంజమ్మ కాళ్లపై బస్సు ఎక్కింది. దీంతో ఆమె రెండు కాళ్లు విరిగాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్​లో వనపర్తి జిల్లా ఆస్పత్రి తరలించారు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు