రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఎప్పుడు, ఏం జరిగింది?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఎప్పుడు,  ఏం జరిగింది?
  • 2021 నవంబర్ ... లక్ష మంది రష్యా సైనికుల మోహరింపు

ఉక్రెయిన్ బార్డర్ లో లక్ష మంది రష్యా సైనికులు మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల చూపించాయి. 

  • 2022, జనవరి.... పశ్చిమా దేశాలకు రష్యా వార్నింగ్

ఉక్రెయిన్ తో పాటు ఒకప్పుడు సోవియట్ లో భాగమైన ఇతర దేశాలకు నాటో లో సభ్యత్వం ఇవ్వొద్దని, నాటో బలగాలను సెంట్రల్ , ఈస్టెర్న్ యూరోప్ నుంచి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

  • 2022, జనవరి10...అమెరికా, రష్యా అధికారులు జెనెవా సమావేశం

అమెరికా, రష్యా అధికారులు జెనెవాలో సమావేశమై చర్చలు జరిపారు. కానీ ఈ చర్చలు సఫలం కాలేదు.

  • 2022, జనవరి 19...రష్యాకు అమెరికా వార్నింగ్

ఉక్రెయిన్ లో మోహనరించిన తన బలగాలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణాములుంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను హెచ్చరించారు.

  • 2022, జనవరి 24... ఉక్రెయిన్ లో నాటో బలగాల మోహరింపు

నాటో తన సైనిక బలగాలను, యుద్ధ ట్యాంకర్లను, జెట్ ఫైటర్లను ఉక్రెయిన్ లో మోహరించింది.

  • 2022, జనవరి 26.... రష్యా డిమాండ్లకు యూఎస్ రిప్లై

నాటో లో ఉన్న విధానాల ప్రకారమే ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడానికి నాటో సభ్య దేశాలు అంగీకరించాయని అమెరికా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తమ సెక్యూరిటీ డిమాండ్స్ గురించి అమెరికా ప్రస్తావించలేదని రష్యా పేర్కొంది. అలాగే తమ ఇంటర్నల్ విషయంలో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

  • 2022, జనవరి 31... ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశం

రష్యా, అమెరికా దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ లో రష్యా జోక్యం వల్ల ప్రపంచ భద్రతకు భంగం కలిగే అవకాశం ఉందని అమెరికా వాదించగా... అలాంటిదేమి లేదని రష్యా కొట్టిపారేసింది.

  • 2022, ఫిబ్రవరి 8... రష్యా ,ఫ్రాన్స్ అధ్యక్షుల సమావేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మ్యాక్రన్ రష్యా అధ్యక్షుడు పుతన్ ను కలిసి ఉక్రెయిన్ విషయం గురించి చర్చించారు. ఇదే అంశమై బ్రిటన్, రష్యా కార్యదర్శుల చర్చలు జరిపారు. అయితే ఉక్రెయిన్ పై దాడులంటివేమి లేవని రష్యా తెలిపింది.

  • 2022, ఫిబ్రవరి 12... రష్యా ,అమెరికా అధ్యక్షుల వీడియో కాన్ఫరెన్స్

అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని, రష్యా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.

  • 2022, ఫిబ్రవరి 12... జీ7 దేశాల సంయుక్త ప్రకటన

ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి.

  • 2022, ఫిబ్రవరి 15.. బలగాలను వెనక్కి పిలిచినట్లు రష్యా ప్రకటన

రష్యా ఉక్రెయిన్ బార్డర్ లోని తమ బలగాలలోని కొంత సైన్యాన్ని వెనక్కి పిలిచినట్లు రష్యా ప్రకటించింది.

  • 2022, ఫిబ్రవరి 21.. ఉక్రెయిన్ లోని సెపరేటిస్ట్ యాక్టివిస్ట్స కి పుతిన్ మద్ధతు

ఉక్రెయిన్ లోని సెపరేట్ ఉద్యమకారులకు పుతిన్ తన మద్ధతు ప్రకటించాడు. దీంతో  రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పింది రష్యా.

  • 2022, ఫిబ్రవరి 24.... ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రకటన

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా