కాశీబుగ్గ, వెలుగు: అమ్మ పేరుతో ఒక మొక్కను (ఏక్ పెడ్ మా కే నామ్) నాటడాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో పర్యావరణ పరిరక్షణ, హరితహారం కార్యక్రమ విస్తరణ, విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీఓ) జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పెడ్ మా కే నామ్ 2026, జాతీయ స్థాయి విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
అనంతరం వివిధ శాఖల జిల్లా ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో జడ్పీ మీటింగ్హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీపై పలు సూచనలు ఇచ్చారు.
