ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌(రామప్ప), వెలుగు: దాదాపు రూ.6కోట్ల విలువ చేసే శిఖం భూమిని కబ్జా చేయడానికి ఓ టీఆర్ఎస్ లీడర్ ప్రయత్నిస్తున్నాడు. చెరువులోని మూడెకరాల భూమి తనదేనంటూ రాత్రికి రాత్రే మొరం, కంకర పోసి చదును చేశాడు. 163 నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే పక్కనే ఈ జాగ ఉండడంతో వెంచర్ గా మార్చడానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం జవహర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో 25 ఏండ్ల కింద ప్రభుత్వం గుడికుంట చెరువును తవ్వించింది. 400 ఎకరాలకు సాగునీరించాలనే లక్ష్యంతో 28 ఎకరాల భూమిలో చెరువును ఏర్పాటు చేసింది. చెరువు కట్ట, తూము, మత్తడి, కాలువలు నిర్మించి ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. అయితే ఈ చెరువు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‒భూపాలపట్నం నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే 163 రోడ్డును ఆనుకొని ఉండడంతో.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌ ఈ భూమిపై కన్నేశాడు. 

మంత్రి పేరు చెప్పి..

రాష్ట్రంలోని కీలక మంత్రితో సదరు లీడర్​కు పరిచయాలు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మొదట చెరువు పక్కనే ఉన్న ఓ రైతు పొలం కొనుగోలు చేశాడు. తన పలుకుబడిని ఉపయోగించుకొని చెరువులోని మరో 3 ఎకరాలకు ఎసరు పెట్టాడు. అమ్మిన రైతు పత్రాలు చూపించి, కబ్జాకు ప్రయత్నించాడు. ఇటీవల టిప్పర్ల సాయంతో రాత్రికి రాత్రే మొరం, కంకర తీసుకొచ్చి చెరువు స్థలాన్ని చదును చేశాడు. రైతులు వెళ్లి నిలదీయడంతో వెనక్కి తగ్గాడు. ఇంత జరిగినా రెవెన్యూ ఆఫీసర్లు కనీసం స్పందించకపోవడం గమనార్హం. గతంలో ఈ చెరువుకు హద్దు రాళ్లు పాతాలని రైతులు కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా.. ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీనిపై వెంకటాపూర్​ తహసీల్దార్ మంజులను వివరణ కోరగా.. గుడికుంట చెరువు కబ్జా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సిబ్బందిని పంపించి, ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఓట్లతోనే కేసీఆర్ కు పని

మొగుళ్లపల్లి, వెలుగు: ఓట్లతోనే కేసీఆర్ పని పడుతుందని, ఎన్నికలయ్యాక పత్తా లేకుండా పోతాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి విమర్శించారు. శనివారం మొగుళ్లపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూస్వాములు, ధనికులకు రైతు బంధు ఇవ్వడం, పేదల పొట్ట కొట్టడమేనన్నారు. దళితబంధు కేవలం టీఆర్ఎస్ అనుచరులకు మాత్రమే దక్కుతోందని ఆరోపించారు. కేంద్ర నిధులతో పనులు చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులు అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.

ఎంపీవోతో వార్డు మెంబర్ల వాగ్వాదం!

ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల సర్పంచ్ ఇటీవల సస్పెండ్ అవ్వగా.. ఉప సర్పంచ్​వంగాల స్వాతికి ఇన్​చార్జి సర్పంచ్ గా శనివారం బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందే బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. ఎంపీవో చేతన్​రెడ్డి కావాలనే మీటింగ్ ను పోస్ట్ పోన్ చేశారని వార్డు మెంబర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికి మెజారిటీ లేకపోవడం వల్లే ఎంపీవో అటెండ్ కాలేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పంచాయతీ ఆఫీసుకు చేరుకున్నారు. వాగ్వాదం చేసిన వార్డు మెంబర్లను బయటకు పంపారు.

వికటించిన ఆర్ఎంపీ ట్రీట్ మెంట్ నిమ్స్ లో చేరిన వృద్ధులు

నెక్కొండ, వెలుగు: ఆర్ఎంపీ ట్రీట్ మెంట్ వికటించి, ఇద్దరు వృద్ధులు హైదరాబాద్ నిమ్స్ లో చేరారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నెక్కొండ తండాకు చెందిన బానోతు చిక్కి, బోడ రాంజ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీంతో నెక్కొండలోని అమృత హాస్పిటల్​కు వెళ్లారు. ఆర్ఎంపీ రాజు వారికి ఇంజక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చారు. కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ హెల్త్ కండీషన్ సీరియస్ గా మారడంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ వో ప్రకాశ్​.. ఆసుపత్రి తనిఖీ కోసం వెళ్లాడు. అప్పటికే ఆర్ఎంపీ తాళం వేసి పరారయ్యాడు. హాస్పిటల్​ను టెంపరరీగా సీజ్ చేశారు.

అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు స్థానిక బాబుజగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యేను భుజాలపై ఎత్తుకున్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, భావి తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్​సురేశ్​కుమార్, ఎమ్మెల్యే సతీమణి ఫాతిమామేరి, మార్కెట్ చైర్మన్​ గుజ్జరి రాజు, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి తదితరులున్నారు.
 

బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి


హనుమకొండ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పోరాడాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దొరల అహంకార పాలనను అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద ఫంక్షన్ హాల్​లో బీజేపీ లీడర్లు, కార్యకర్తలతో మీటింగ్​జరగగా చీఫ్ గెస్టుగా ప్రేమేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్​కు ఎన్నికలు వస్తేనే దళిత బంధు, చేనేత బంధు, గిరిజన బంధు, నిరుద్యోగ భృతి గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటే వారితరహాలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. రావు పద్మ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందన్నారు. సమావేశంలో బీజేపీ  జిల్లా ఇన్​ఛార్జ్​  డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, మాజీ మేయర్ డాక్టర్.టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, ఒంటేరు జైపాల్, మొలుగూరి భిక్షపతి,  జిల్లా ప్రధాన కార్యదర్శులు దేశిని సదానందం గౌడ్, అర్పీ .జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి ఉన్నారు.