చిచ్చురేపిన ప్రీ ప్రైమరీ స్కూల్..గవర్నమెంట్,అంగన్ వాడీ టీచర్ల నడుమ గొడవ..వరంగల్ జిల్లాలో ఘటన

చిచ్చురేపిన ప్రీ ప్రైమరీ స్కూల్..గవర్నమెంట్,అంగన్ వాడీ టీచర్ల  నడుమ గొడవ..వరంగల్  జిల్లాలో ఘటన

నెక్కొండ, వెలుగు: వరంగల్  జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో గవర్నమెంట్  టీచర్, అంగన్​వాడీ టీచర్​ మధ్య సోమవారం గొడవ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెంకటాపురం ప్రైమరీ స్కూల్​కు ప్రీ ప్రైమరీ స్కూల్​ను మంజూరు చేసింది. అందులో సరిపడా స్టూడెంట్స్​ లేకపోవడంతో పక్కనే ఉన్న అంగన్​వాడీ సెంటర్​ పిల్లలను ప్రీ ప్రైమరీ క్లాస్​రూంలో కూర్చోబెడుతున్నారు. 

ఈక్రమంలో అంగన్​వాడీ టీచర్​ ఉమాదేవికి ఐసీడీఎస్​ సూపర్​వైజర్​ షోకాజ్​నోటీసు జారీ చేస్తానని చెప్పారు. దీంతో స్కూల్​ హెచ్ఎం​శ్రీనివాస్​ వద్దకు వెళ్లి తమ స్టూడెంట్స్​ను అంగన్​వాడీ సెంటర్​కు పంపించాలని చెప్పినా పట్టించుకోలేదు. ఈక్రమంలో సోమవారం అంగన్​వాడీ టీచర్, హెచ్ఎం​మధ్య గొడవ జరిగింది. స్కూల్, అంగన్​వాడీసెంటర్​లోని రిజిస్టర్లలో ఒకే పేర్లు ఉన్నాయి. ఆఫీసర్లు జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.