రేపటి నుంచి నిట్​లో ‘టెక్నోజియాన్​’ ఫెస్ట్

రేపటి నుంచి నిట్​లో ‘టెక్నోజియాన్​’ ఫెస్ట్

ప్రారంభోత్సవానికి రానున్న రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు జి. సతీశ్​ రెడ్డి

కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్​లో ఈనెల 16 నుంచి 18 వరకు టెక్నోజియాన్​ ఫెస్ట్​ నిర్వహిస్తున్నట్టు నిట్​ డైరెక్టర్​ ఎన్వీ రమణారావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, నేటి సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి చీఫ్​ గెస్ట్​గా రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీశ్​ రెడ్డి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. ఈ ఫెస్ట్ సౌత్​ ఇండియాలోనే రెండో అతిపెద్ద టెక్నికల్ ఫెస్ట్ అని, విజేతలకు రూ. 20లక్షల విలువైన బహుమతులు అందిస్తామని చెప్పారు.

ఈ సంవత్సరం ‘ఇగ్నోసీ’ థీమ్​తో వేడుకలు నిర్వహిస్తున్నామని, దేశంలోని వివిధ కాలేజీల స్టూడెంట్లు వస్తున్నారని వివరించారు. సాంకేతిక పరిజ్ణానం– విద్యార్థి వికాసం అనే టాపిక్​పై ప్రముఖుల సెమినార్లు, ఈవెంట్లు, వర్క్‌షాప్లుఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన ఈవెంట్లలో భాగంగా నిర్వహించే జహాజ్, అల్యూర్, డ్రోన్ రేసింగ్​, ముగింపు రోజు రాత్రి ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ బెన్నీ దయాల్, విశాల్ చంద్రశేఖర్ తో ప్రత్యేక షో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.ఆనంద్ కిషోర్, స్టూడెంట్ కోఆర్టినేటర్లు, కోర్ టీం సభ్యులు పాల్గొన్నారు.