తెలంగాణపై మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను తుఫాన్ ఆగం చేసింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊర్లకు ఊర్లనే ముంచేసింది. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 41.9 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతం నమోదయ్యింది.
మరో వైపు ఇవాళ కూడా తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు
వరంగల్ ట్రైసిటీతోపాటు కరీంనగర్, హుజూరాబాద్‌లో వందలాది కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయాయి. కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కొన్ని వందల ఊర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి
వర్షపాతం వివరాలు
- వరంగల్ హన్మకొండలోని భీమదేవర పల్లెలో 41.9 సెంటీమీటర్లు.
- వరంగల్ లోని కల్లెడ లో 38.58
- వరంగల్ లోని ఉరుస్ లో 34.38
- హన్మకొండ లోని ధర్మసాగర్ లో 33.28
- సిద్దిపేట లోని హుస్నాబాద్ లో 29.8
- కరీంనగర్ లోని బోర్నపల్లి లో 26
- మహబూబాబాద్ లోని ఇందుర్తి లో 23.4
- జనగాంలోని గూడూరు లో 27.3
- హనుమకొండ జిల్లా చింతగట్టులో 26.3,
- జనగామ జిల్లా జఫర్ గఢ్ లో 25.5...
- వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 25.4,
